Thursday, August 28, 2025

సెప్టెంబర్ ఒకటి నుంచి రేషన్ షాప్‌ల బంద్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లకు రావలసిన కమిషన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉచిత బియ్యం పథకాన్ని విజయవంతం చేసినట్లు గొప్పలు చెప్పకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల కమిషన్ డబ్బులు ఇవ్వడంతో తీవ్ర జాప్యం చేస్తోందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాప్‌ల బంద్ నిర్వహిస్తున్నట్లు, సెప్టెంబర్ 4వ తేదీన అసెంబ్లీ ముట్టడిస్తామని ఆయన గురువారం సివిల్ సప్లై భవన్ వద్ద ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు నెలల నుంచి డి రేషన్ డీలర్లకు కమిషన్ డబ్బులు, రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గన్ని బ్యాగ్స్ డబ్బులు రావడంలేదన్నారు.

దీంతో రేషన్ డీలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆగస్టు 31వ తేదీ వరకు రేషన్ డీలర్లకు కమిషన్ డబ్బులు విడుదల చేయకుంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపులు మూసివేసి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తామన్నారు. రెండో తేదీన ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా, మూడో తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. చివరకు సెప్టెంబర్ నాల్గొవ తేదీన రాష్ట్రంలోని రేషన్ డీలర్లతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు, కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వంగరి నాగరాజు, మల్లికార్జున్ గౌడ్, వైకుంఠం, అజిజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News