హైదరాబాద్: ఐపిఎల్ వేలం ముగిసింది. వేలంలో జట్లన్నీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ప్రత్యర్థులపై యుద్ధం చేయడానికి జట్లన్నీ ఆస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల జట్టు మాత్రం కెప్టెన్సీ సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఆర్‌సిబికి కెప్టెన్ ఎవరు అనేది తేలాల్సి ఉంది. గత సంవత్సరం ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం వేలంలో అతడిని ఆర్‌సిబి జట్టులోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఆర్‌సిబి మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్ స్పందించారు. విరాట్ కోహ్లీనే పగ్గాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.
ఇప్పుడున్న ఆర్‌సిబి జట్టులోని ఆటగాళ్లలో కెప్టెన్ చేయగల సత్తా విరాట్‌కే ఉందని ప్రశంసించారు. ఇప్పటివరకు విరాట్ ఎటువంటి ప్రకటన ఎబి చేయలేదన్నారు. ప్రస్తుతం ఆర్‌సిబి జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడి ఉండడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తుందన్నారు. ఆర్‌సిబిలో స్పిన్నర్ లేకపోవడం మైనస్‌గా ఉందని పేర్కొన్నారు. చిన్నస్వామి స్టేడియంలో పరుగులతో పాటు వికెట్లు తీయడంలో ఆర్‌సిబి ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాలని సూచించారు.