Saturday, April 27, 2024

జాబ్ ఇప్పిస్తానని…. అమ్మాయిపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

rape

 

హైదరాబాద్: జాబ్ ఇప్పిస్తానని అమ్మాయిపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సికింద్రాబాద్ లాడ్జ్‌లో అత్యాచారం చేశాడు. దీంతో అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 25 సంవత్సరాల యువతి ఉద్యోగం కోసం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జనవరి 18న చేరింది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ సదరు అమ్మాయికి జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఆయన అనచరుడు ఆమెను కారులో తీసుకెళ్లిన అనంతరం ఆమెకు మద్య తాగించారు. అనంతరం ఆమె ఉంటున్న లాడ్జ్ వద్ద దించేశారు. తరువాత ఆమెను మరో లాడ్జ్‌కు బలవంతంగా తీసుకెళ్లారు. ఆ లాడ్జ్‌లో ఆమెపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గోపాల పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం వెంటేశం తెలిపాడు. ప్రస్తుతం కారు డ్రైవర్, రియల్ స్టేట్ బ్రోకర్, అతడి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమ్మాయిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

Real Estate Broker rape on Girl in SCBD Lodge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News