Saturday, July 27, 2024

పర్యాటక బస్సుపై దాడిలో విదేశీ ఉగ్రవాదుల హస్తం ?

- Advertisement -
- Advertisement -

యాత్రికులే లక్షంగా జమ్ముకశ్మీర్‌లో పర్యాటక బస్సుపై జరిగిన దాడి వెనుక ముగ్గురు విదేశీ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఆ ప్రాంతంలో మూడు ఉగ్రవాద గ్రూపులు ఆపరేట్ చేశాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రియాసీ రీజియన్‌లో అటవీ ప్రాంతంలో ఎగువ భాగంలో ఎవరూ వెళ్లడానికి వీలు లేని చోట కనీసం ఇద్దరైనా ఉగ్రవాదులు దాగి ఉంటారని, ఆ తరువాత దిగివచ్చి దాడికి పాల్పడి ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులను కనుగొనడానికి భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఎం 4 కార్బైన్స్, 1980లో అమెరికా తయారు చేసిన రైఫిల్స్,

ఈ దాడికి ఉపయోగించినట్టు కనుగొన్నారు. ప్రపంచం అంతా మిలిటరీ దళాలు ఈ రైఫిల్స్‌ను వాడుతున్నాయి. పాకిస్థాన్ స్పెషల్ ఫోర్స్ సింధ్ పోలీస్ స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ కూడా ఈ రైఫిల్స్‌ను వాడుతున్నట్టు బయటపడింది. దాడిలో తొమ్మిది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సినా ్హ ఈ దాడిని ఖండించారు. ప్రధాని మోడీ ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. దోషులెవరైనా క్షమించేది లేదని హెచ్చరించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతాదళాలు, పోలీస్‌లు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News