Monday, April 22, 2024

రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

- Advertisement -
- Advertisement -

అవసరానికి తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్న అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తం గా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం, వ్యవసాయంతో పాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ని రంతర విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో వినియోగం సైతం భారీగా పెరుగుతున్నది. రాష్ట్రములో గత ఏడాది 297.89 మిలియ న్ యూనిట్లు గా నున్న అత్యధిక విద్యుత్ వినియోగం, బుధవారం నాటికి 298.19 మిలియన్ యూనిట్లు వినియోగంతో కొత్త రికార్డును నెలకొల్పింది. జిహెచ్‌ఎంసిలో గతేడాది 59.53 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, బుధవారం మార్చ్ 6 న అత్యధికంగా 69.31 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యింది.

ఈ సీజన్ లో ఇదే అధికంగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్రములో గతేడాది జనవరిలో సరాసరి విద్యుత్ వినియోగం 227.42 ఎంయు ఉండగా ఈ ఏడాది జనవరిలో 243.12 ఎంయు నమోదైంది. అదే విధంగా గతేడాది ఫిబ్రవరిలో సరాసరి విద్యుత్ వినియోగం 263.48 ఎంయు నమోదు కాగా ఈ ఏడాది ఫిబ్రవరి లో 272.86 ఎంయు ఉంది. గతేడాది మార్చ్ 6 వరకు సరాస రి విద్యుత్ వినియోగం 291.33 ఎంయు ఉండగా ఈ ఏడాది మార్చ్ 6 వరకు 292.66 ఎం యుగా నమోదైంది. అదే విధంగా జిహెచ్‌ఎంసి పరిధిలో గత సంవత్సరం జనవరిలో సరాసరి విద్యుత్ వినియోగం 49.45 ఎంయు నమోదు కాగా ఈ సంవత్సరం జనవరిలో 54.13 ఎంయు నమోదైంది. అదే విధంగా గత సంవత్సరం ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగం 54.50 ఎం యు నమోదు కాగా అది ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి 61.09 ఎంయు ఉంది. గత సంవత్సరం మార్చి నాటికి సరాసరి విద్యు త్ వినియో గం 57.4 ఎంయు ఉండగా కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 66.13 ఎంయుగా నమోదైంది. గతేడాది మార్చ్ 6 వరకు అత్యధికంగా 14856 మెగావాట్లు ( 2023 మార్చ్ 3) గరిష్ట డిమాండ్ నమోదవగా ఈ ఏడాది మార్చ్ ఒకటి నుండే 15000 మెగావాట్ల దాటి విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నది. మార్చ్ 6 బుధవారం ఈ సీజన్లో లో అత్యధికగంగా 15403 విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. ఇది గతఏడాది కంటే 573 మెగావాట్లు అదనంగా నమోదవడం విశేషం. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్‌లోగతేడాది మార్చ్ 6 వరకు అత్యధికంగా 2910 మెగావాట్లు ( 2023 మార్చ్ 3) గరిష్ట డిమాండ్ నమోదవగా ఈ ఏడాది మార్చ్ ఒకటి నుండే 3000 మెగావాట్ల దాటి విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నది. మార్చ్ 6 బుధవారం ఈ సీజన్లో లో అత్యధికంగా 3335 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది.విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సంసిద్దమై వున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News