Monday, June 5, 2023

ఒక పక్క ఎండలు.. మరో వైపు జల్లులు

- Advertisement -
- Advertisement -

 ఎనిమిది ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిడ్రీలపైనే
 నేటి నుండి తేలికపాటి వర్షాలు: వాతావరణ కేంద్రం వెల్లడి
మనతెలగాణ/హైదరాబాద్: ఒక పక్క మంట పుట్టిస్తున్న ఎండలు..మరో వైపు తేలిక పాటి చిరుజల్లులతో తెలంగాణలో మిశ్రమ వాతవరణం ఏర్పడింది. గురువారం రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఎనిమిది కేంద్రాల్లో రెడ్ మార్కు గీత దాటి 45డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికం గా నల్లగొండ జిల్లా నిడమనూరులో 45.9డిగ్రీ లు నమోదయ్యాయి. కరీం నగర్‌జిల్లా తంగుల్ల లో 45.6, నల్లగొండ జిల్లా దామరచర్లలో 45.5, కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.4, సూర్యాపేట జిల్లా కేతవారిగూడెంలో 45.4,నల్లగొండ జిల్లా ఇబ్రహీంపట్నంలో 45.2, మటూరులో 45.2, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 45.1 డి గ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వీటితోపా టు టాప్‌టెన్‌జాబితాలో చివరన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.8, ఖమ్మం జిల్లా కూసుమంచిలో 44.8డిడ్రీల ఉష్ణోగ్రలు నమోదయ్యాయి. తూర్పు మధ్యప్రదేశ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించివుంది. దిగువ స్థాయిలో గాలులు వాయువ్యదిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం నుండి తేలికపాటి నుంచి ఒకమోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39నుండి 41డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వం చ మండలం సీతారామపట్నంలో 18.5మి.మి వర్షం కురిసింది. నిజామాబాద్‌జిల్లా లక్మాపూర్‌లో18, వికారబాద్ జిల్లా చౌడాపూర్‌లో 16.8, నల్లగొండ జిల్లా వెలుగుపల్లిలో 11.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతకొత్తగూడెంలో 11.8 వికారబాద్ జిల్లా ముజాహిద్‌పూర్‌లో 11.3, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 11.3, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పెంట్లమ్‌లో 10.3 మి.మి వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతా ల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News