Sunday, December 15, 2024

ఎలక్ట్రిక్  వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫ్రీ

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి రాష్ట్రంలో అమల్లోకి ఈవీ కొత్త పాలసీ 2026 డిసెంబర్ 31
వరకు అమలు కంపెనీల చొరవతో ఛార్జింగ్ స్టేషన్లు హైదరాబాద్‌లో
త్వరలో రోడ్లపైకి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యంలో హైదరాబాద్
మరో ఢిల్లీ కావొద్దనే ఈ నిర్ణయాలు కొత్త ఈవీ పాలసీ విధాన
నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 18 సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వె హికిల్స్ (ఈవి) పాలసీ అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆదివారం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త పాలసీ వివరాలు ప్ర కటించారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అ న్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపా రు. జీవో 41 ద్వారా తీసుకువచ్చిన ఈ కొత్త పా లసీ 2026, డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్‌పోర్టు బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని, దీనిద్వారా వినియోగదారులకు ఏడాదికి రూ.లక్ష వరకు ఆదా అవుతుందని అన్నారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ నగరం కాలుష్యం కాకూడదనే ఉ ద్దేశంతో ఈవీ పాలసీని ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సు లు తేవాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే సిటీలో మొత్తం ఈవీ ఆర్టీ సీ బస్సులు నడుస్తాయని మంత్రి పొన్నం తెలిపారు.

రేపటి నుండి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదని, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. కాలుష్యం గురించి మంత్రి వివరిస్తూ హైదరాబాద్‌లో 83, పఠాన్‌చెరులో 72 కాలుష్యం ఉందని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, అయితే ఇంకా కొంత మౌలిక సదుపాయాలు రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు పరిమితి సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాల వాడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవి పాలసీ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు కాలుష్యం నుండి నివారించేందుకు ఈ చర్యలు దోహడపడతాయని తెలిపారు. 15 సంవత్సరాల దాటిన వాహనాలను ధ్వంసం చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు తెస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనుమతి తీసుకొని క్షేత్ర స్థాయిలో నాలుగు రాష్ట్రాలు తిరిగి ఉత్తమ ఈవి విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు.

ఏటా లక్షా 50 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి
దేశంలో ప్రతి ఏటా లక్షా 50 వేల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారని, తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా శాఖకు కొత్త లోగో వస్తుందని, కొత్త వాహనాలు కూడా వస్తున్నాయని మంత్రి చెప్పారు. సోమవారం నుండి ఎలక్రిక్ వాహనాలు అపరిమితంగా కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. ఈవిలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు ఉంటాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని చార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈవి వాహనాలకు గతంలో 5 వేల వాహనాలకు టాక్స్ మినహాయింపు ఇచ్చారని, అంతకు మించి ఇవ్వలేదని తెలిపారు.

అయితే ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల వస్తున్నాయని చెప్పారు. రానున్న పది రోజుల్లో రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీ హెచ్‌ఎండిఏ, హైదరాబాద్ పోలీస్‌లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రవాణాశాఖలో పదోన్నతుల గురించి వివరిస్తూ పదోన్నతులకు వ్యతిరేకం కాదని, అన్నింటిని క్లియర్ చేస్తామని అన్నారు. ఇప్పటికే రవాణా శాఖలో 58 కానిస్టేబుల్ నియామకం, ఎఎంవిఐల నియామకాలు జరిగాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కడో ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించవద్దని మంత్రి హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News