Thursday, January 23, 2025

పిజి ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

Release of counseling schedule for PG admissions

నేటి నుంచి అక్టోబర్ 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష (సిపిగెట్ -2022)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు బుధవారం(సెప్టెంబర్ 28) నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు అక్టోబర్ 12 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. వచ్చే నెల 18వ తేదీన సీట్ల కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. అక్టోబర్ 24 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News