Wednesday, September 18, 2024

కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిబిషన్‌కు హాజరైన చైనా అధినేత జిన్‌పింగ్

- Advertisement -
- Advertisement -

To the Communist Party demonstration Xi Jinping attended

ఎస్‌సిఒ సమావేశం తర్వాత తొలిసారి బహిరంగ సమావేశానికి

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం పార్టీ ప్రదర్శనకు హాజరయ్యారు. 16న సదస్సు నుంచి చైనాకు తిరిగివచ్చిన జిన్‌పింగ్ బయట ప్రపంచానికి కనిపించడం ఇదే ప్రథమం. వచ్చే నెలలో అధికార పార్టీ కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో జిన్‌పింగ్ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన సైనిక నిర్బంధంలో ఉన్నారనే వదంతులు వ్యాపించాయి. అయితే వీటికి అధికారికంగా చెక్ చైనా, ఆదేశ అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా గత దశాబ్దకాలంలో సాధించిన విజయాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం ప్రదర్శనకు హాజరయ్యారని చైనా ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది. ఈనెల 16న ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన నుంచి తిరిగి వచ్చాక చైనా ప్రభుత్వ అధినేత బహరింగ సమావేశంలో కనిపించడం ప్రథమమని పేర్కొంది. పార్టీ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న అధ్యక్షుడు జిన్‌పింగ్ సదస్సులో మాట్లాడుతూ లక్షణాలతో కూడిన సోషలిజం కొత్త విజయంవైపు కృతనిశ్చయంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారని ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హూవా నివేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News