గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా పెద్ది. (peddi) ఫస్ట్ గ్లింప్స్‌తోనే మంచి అంచనాలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనికి అనుగుణంగానే బుచ్చిబాబు మంచి ట్రీట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. గతంలో రంగస్థలం సినిమాకి జిగేలు రాణి ఎలాంటి హైలైట్ అయ్యిందో ఇప్పుడు ఇదే రీతిలో శ్రీకాకుళంకి చెందిన ఓ ఫేమస్ ఫోక్ సాంగ్‌ని మేకర్స్ రీమిక్స్ చేస్తున్నట్టుగా తెలిసింది. శ్రీకాకుళం జానపద గేయం (Srikakulam folk song) మా ఊరి ప్రెసిడెంటు అనే సాంగ్‌ని మేకర్స్ రీమిక్స్ చేయగా ఈ సాంగ్‌ని ప్రముఖ జానపద గాయకులు, రచయిత పెంచల్ దాస్ ఆలపించినట్టుగా సమాచారం. మరి ఈ ఫోక్ సాంగ్‌కి రెహమాన్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి మాత్రం రంగస్థలానికి మించిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు రాబోతుంది అని చెప్పవచ్చు.
’రంగస్థలం’ పాటకు మించిన స్పెషల్ సాంగ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -