Monday, April 29, 2024

1,132 మంది పోలీసులకు పతకాలు

- Advertisement -
- Advertisement -

1,132 మంది పోలీసు పతకాలు
ధైర్యంలో సేవాపాలనకు గుర్తింపు
20మంది తెలంగాణ వారికి అవార్డులు
అదనపు డిజిలు సౌమ్యా మిశ్రా, చౌహాన్‌లకు గౌరవం

న్యూఢిల్లీ : ధైర్య సాహసాలు, విద్యుక్త ధర్మంలో అంకితభావం ప్రదర్శించిన పోలీసు సిబ్బందిని జాతి గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో గౌరవించుకుంది. దాదాపు వేయికి పైగా వివిధ స్థాయిల్లోని పోలీసు ఉద్యోగులకు బహుళ స్థాయిల్లోని ధైర్య, సేవా పతకాలను ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అదికార వర్గాలు గురువారం తమ ప్రకటనలో తెలిపాయి. పతకాలు పొందిన వారిలో తెలంగాణకు చెందిన 20 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు తొమ్మండుగురు ఉన్నారు. తెలంగాణ అదనపు డిజిపిలు సౌమ్యా మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్‌లకు ఈ పతకాలు దక్కాయి. పురస్కార విజేతలలో 277 మంది ధైర్య పురస్కారాలు పొందిన వారు ఉన్నారు.

75వ రిపబ్లిక్ డే నేపథ్యంలో వీరికి అవార్డుల బహుకరణ జరిగినట్లు వివరించారు. పతకాల ఎంపిక పద్ధతిని పునః వ్యవస్థీకరించిన తరువాత తొలిసారిగా మొత్తం సంబంధిత పలు కేటగిరిలలో వారి సేవా భావన , విధుల పాలన వంటి అంశాలకు సంబంధించి పోలీసు, అగ్నిమాపక దళం, హోం గార్డులు, పౌర రక్షణ, నేర సంస్కరణల విభాగాలకు చెందిన మొత్తం 1,132 మందిని అవార్డులకు ఎంపిక చేశారని ప్రకటనలో తెలిపారు. 2024 రిపబ్లిక్ డే పురస్కారాల విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. 16 రకాల ధైర్య పతాకాలను ఇప్పుడు నాలుగుగా వర్గీకరించారు. వీటిని పిఎంజి, జిఎం, పిఎస్‌ఎం, ఎంఎస్‌ఎం పతాకాలుగా విభజించారు.

సిబ్బంది ప్రతిభా పాటవాలు, వారు కనబర్చిన ధైర్య సాహసాలు, విధి నిర్వహణలో అంకితభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుల గుర్తింపు జరిగింది. ధైర్య సాహసపతకాలు పొందిన రాష్ట్రాలలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారు ఉన్నారు. 277 గ్యాలంట్రీ అవార్డులలో 119 నక్సల్స్ ప్రాబల్యపు ప్రాంతాలలో పనిచేసే పోలీసు సిబ్బందికి దక్కాయి. కాగా జమ్మూ కశ్మీర్‌లో విధుల నిర్వహణలో ఉన్న 133 మందికి ఈ గౌరవం దక్కింది. ప్రెసిడెంట్ మోడల్ ఫర్ గ్యాలంట్రీ ఈ పతకాలలో సర్వోన్నతంగా ఉంది. దీనికి సరిహద్దు భద్రతా బలగాలు (బిఎస్‌ఎఫ్)కు చెందిన ఇద్దరు జవాన్లను ఎంపిక చేశారు. మరణానంతరం వీరికి ఈ గుర్తింపు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News