Monday, April 29, 2024

హిట్ అండ్ రన్ కేసులో నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఐదుగురిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎసిపి

మనతెలంగాణ, సిటిబ్యూరోః  జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎసిపి జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రిత్విక్ రెడ్డికి అమేజాన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో స్నేహితులు వైష్ణవి, పొసుసాని లోకేశ్వర్‌రావు, బుల్లా అభిలాష్, అనికేష్‌కు పార్టీ ఇచ్చాడు, అందరు కలిసి కారులో రిత్విక్ ఉద్యోగం చేసే కంపెనీని చూసేందుకు కారులో బయలు దేరాడు.

నిందితులు తుకారాంగేట్ వద్ద ఉన్న వైన్ షాపు వద్ద మద్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. మద్యం తాగి ఉన్న రిత్విక్ కారును డ్రైవింగ్ చేశాడు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ గాంధీనగర్‌కు చెందిన లింగాల తారక్‌రామ్(30) మాదాపూర్ నోవాటెల్లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు విధులు ముగించుకుని తనతో పనిచేస్తున్న బౌన్సర్ రాజుతో కలిసి జూబ్లీహిల్స్ మీదుగా బైకుపై గాంధీనగర్ వస్తున్నాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తారక్‌రామ్ పైకి ఎగిరి కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే అటువైపు వెళ్తున్న వారు తీవ్రంగా గాయపడిన రాజును 108లో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, తారకరామ్‌కు రెండేళ్ల క్రితం సుధారాణితో వివాహం జరిగింది. ఇద్దరికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా టీఆర్ నంబరుతో ఉన్న కారు ద్వారంపూడి నాగ పేరుతో ఉన్నట్లు తెలిసింది. ఉస్మానియాలో శవపంచనామా అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ రాణా ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో రిత్విక్ రెడ్డి సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు, కారును బిహెచ్‌ఈఎల్‌లో ఉన్న తన స్నేహితుడి వద్ద పార్కింగ్ చేశాడు. నిందితుల కోసం గాలించి.. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News