Tuesday, September 16, 2025

సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః టిఎస్‌పిఎస్‌సి గ్రూప్4 పరీక్షల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాలకు 500మీటర్ల సమీపంలో నలుగురి కంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో గుమికూడవద్దని ఆదేశించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమలులో ఉంటాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News