Saturday, December 14, 2024

సచివాలయం పరిధిలో 144 సెక్షన్ విధింపు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. సచివాలయం నుంచి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. ధర్నాలు, ర్యాలీలను నిషేధించింది. ఇందిరాపార్క్‌లో ధర్నాలు, ర్యాలీలు తీసుకోవచ్చని పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవలే సచివాలయంలో వాస్తు మార్పులు చేసిన విషయం విదితమే. లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న ప్రధాన గేట్‌ను శాశ్వతంగా మూసివేసింది. ఎన్టీపార్క్ వైపు ఈశాస్యంలో మరో గేటు నిర్మాణం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ గేటు నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయంలోకి వెళ్లనున్నారు. ఇక సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ గేట్లను కలుపుతూ 27 ఫీట్లతో రోడ్డు మార్గాన్ని నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News