Saturday, March 2, 2024

కామారెడ్డి.. తెలంగాణ దశ దిశను మార్చే తీర్పు ఇవ్వాలి: రేవంత్

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ ను గెలిపిస్తే.. కామారెడ్డిలో వేల కోట్లు విలువైన భూములు కబ్జా చేస్తాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన విజయ భేరి యాత్రలో రేవంత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వని కేసీఆర్ కు ఓటు ఎందుకు వేయాలని అన్నారు. కేసీఆర్ ఇచ్చే రూ.10వేలకు ఆశపడి ఓటు వేయొద్దని కోరారు.

ఐదేళ్లుగా రుణమాఫీ పూర్తి చేయని కేసీఆర్ ను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. రైతుబంధు మీద బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.15వేలు జమ చేస్తామని చెప్పారు. తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును కామారెడ్డి ప్రజలు ఇవ్వాలని రేవంత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News