Sunday, May 12, 2024

నయా సాల్ ‘జోష్’

- Advertisement -
- Advertisement -

Revenue of Rs 32000 crore to Excise Department in year 2021

తాగుడు, తినుడు తగ్గేదేలే

రెండు రోజుల్లో రూ.272కోట్ల మద్యం విక్రయాలు
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అధికం
2021సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు రూ.32వేల కోట్ల పైచిలుకు ఆదాయం

మనతెలంగాణ/హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి. డిసెంబర్ 31వ తేదీన సుమారుగా రూ.171.93 కోట్ల మద్యం అమ్మకాలతో ఆబ్కారీ శాఖ రికార్డు సృష్టించగా, రెండోరోజూ జనవరి 01, 2022వ తేదీ, శనివారం నాడు సుమారు రూ.100 కోట్ల మద్యం అమ్మకాలను జరిపి ఎక్సైజ్ శాఖ తమ రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2021 సంవత్సరంలో జరిగిన మద్యం విక్రయాలు అత్యధికమని ఆబ్కారీ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీన సుమారు రూ.171.93 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, రెండోరోజూ శనివారం (01.01.2022)న సుమారుగా రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 01వ తేదీ వరకు (6 రోజులను) కలిపి సుమారుగా రూ.1,000 కోట్ల మద్యం అమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా గత సంవత్సరం డిసెంబర్‌లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల మద్యం అమ్ముడుపోగా, 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి రూ.32 వేల కోట్ల పైచిలుకు మద్యం విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి.

రెండోరోజూ కొనసాగింపు

జనవరి 01, 2022 (శనివారం) సుమారుగా రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగినట్టు ఆబ్కారీ శాఖ వర్గాలు వెల్లడించాయి. రంగారెడ్డి 1 మద్యం డిపోల్లో సుమారుగా రూ.7.84, 2 డిపోలో రూ.9.75 కోట్లు, కరీంనగర్‌లో రూ. 5.34, ఖమ్మంలో రూ.8.50 కోట్లు, మేడ్చల్ 1లో 5.26 కోట్లు, మేడ్చల్ 2లో 5.36 కోట్లు, నల్లగొండలో రూ.8.11 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ. 6.75 కోట్లు, హైదరాబాద్ 1లో రూ.7.92 కోట్లు, 2 డిపోలో రూ.9.98 కోట్లు, హన్మకొండ 1లో రూ.4.92 కోట్లు, 2 డిపోలో రూ.5.05 కోట్లు, మంచిర్యాలలో రూ.5.6 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి.

గత సంవత్సరం కంటే రూ.4,621 కోట్లు విలువైన

రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016లో రూ.14,075 కోట్ల విలువైన 2.72 కోట్ల కేసుల లిక్కర్, 3.42 కోట్ల కేసుల బీరు అమ్ముడు పోగా, 2020 సంవత్సరంలో రూ.25,601.39 కోట్ల విలువైన 3.18 కోట్ల కేసులు లిక్కర్, 2.93 కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. అదే 2021 సంవత్సరంలో తీసుకుంటే రూ.32 వేల కోట్ల విలువైన 3.69 కోట్ల కేసుల లిక్కర్, 3.26కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం కంటే రూ.4,621 కోట్లు విలువైన మద్యం ఎక్కువ అమ్ముడయ్యిందని అధికారులు తెలిపారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26 కోట్లు

డిసెంబర్ 31వ తేదీన (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.24.78 కోట్లు, హైదరాబాద్ రూ.23.13 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. దీంతో మద్యం అమ్మకాలు డిసెంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. గత నెలలో మద్యం అమ్మకాలు రూ.3,459 కోట్లు జరిగాయి. ఇందులో 40.48 కేసుల లిక్కర్, 34 లక్షల కేసులకు పైగా బీర్ల అమ్మకాలు ఉన్నాయి. మొత్తంగా 2021లో రూ.33 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

ఈ జిల్లాల్లోనే అత్యధిక విక్రయాలు

కరోనా ప్రభావం దాదాపు అన్ని వ్యవస్థల మీద పడినా అబ్కారీ శాఖ మీద మాత్రం పడలేదు. 2021 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన మద్యం విక్రయాలను పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7,673 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా నల్గొండ జిల్లాలో రూ. 3289 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్‌లో రూ. 3208 కోట్లు, ఆదిలాబాద్, నిజామాబాద్‌లు మినహా అన్ని జిల్లాల్లో రెండువేల కోట్లకు తక్కువ కాకుండా రెండున్నర వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News