Thursday, September 19, 2024

హైడ్రా నెక్ట్స్ టార్గెట్ మల్లారెడ్డి అల్లుడే.. కాలేజీలకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో సంచలనంగా మారిన హైడ్రా తన నెక్ట్స్ టార్గెట్ ను ఫిక్స్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలపై పలు ఫిర్యాదులు రావడంతో హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దుండిగల్‌లోని MLRIT, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. చిన్నదామర చెరువు ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే వాటిని హైడ్రా కూల్చేయనుందనే వార్తలు సోసల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే, అకాడమిక్ ఇయర్ కొనసాగుతుండటంతో విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని.. కాలేజ్ యాజమాన్యానికి కొంతసమయం ఇస్తామని హైడ్రా కిమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News