Sunday, September 15, 2024

స్పెయిన్ సంచలనం.. టీ20 క్రికెట్ లో ప్రపంచ రికార్డు

- Advertisement -
- Advertisement -

టీ20 క్రికెట్ లో స్పెయిన్ క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా 14 మ్యాచ్‌లు గెలిచిన తొలి పురుషుల జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం పోర్ట్ సోయిఫ్‌లో జరిగిన ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్ సబ్ రీజినల్ యూరప్ క్వాలిఫయర్ గ్రూప్ సి మ్యాచ్‌లో గ్రీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన స్పెయిన్ ఈ ఘనత సాధించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఐల్ ఆఫ్ మ్యాన్‌పై విజయంతో జట్టుకు విజయాల పరంపర మొదలైంది.

వరుసగా అత్యధిక T20I విజయాల పట్టికలో స్పెయిన్ అగ్రస్థానంలో ఉండగా, బెర్ముడా, మలేషియా వరుసగా 13 వరుస విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. ICC ఫుల్ టైమ్ మెంబర్ టీమ్స్(టెస్టులు ఆడే దేశాలు) భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లు వరుసగా 12 టీ20 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక, 17 వరుస T20I విజయాలతో థాయ్‌లాండ్ మహిళల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News