Sunday, June 16, 2024

టీమిండియా కోచ్ పదవిని తిరస్కరించిన రికీ పాంటింగ్!

- Advertisement -
- Advertisement -

టీమిండియా ప్రధాన కోచ్ పదవిని భర్తీ చేసే పనిలో పడింది బీసీసీఐ. జూన్ తో ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి గడువు ముగుస్తుండడంతో.. నయా హెడ్ కోచ్ కోసం వేట కొనసాగిస్తుంది. ఈక్రమంలో పలువురు క్రికెటర్ల పేర్లు తెరపైకి వచ్చాయి.  ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను సంప్రదించినట్లు సమాచారం. టీమిండియాకు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే విషయంపై పాంటింగ్ తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే, పాంటింగ్..బీసీసీఐ అభ్యర్థనను తిరస్కరించాడట.

టీమిండియాకు కోచ్‌గా ఉండేందుకు బీసీసీఐ తనను సంప్రదించిందని రికీ పాంటింగ్ వెల్లడించారు. “ఒక జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండటం నాకిష్టమే. కానీ నా ప్రస్తుత లైఫ్ స్టైల్‌కి అది సెట్ కాదు. కోచ్ అంటే ఏడాదిలో 10 నుంచి 11 నెలలు జట్టుతోనే ఉండాలి. ఐపీఎల్ లోనూ పని చేయకూడదు. అంతేకాకుండా నేను నా ఇంటి వద్ద ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటున్నా. అందుకే బీసీసీఐ ఆఫర్‌ను కాదనుకున్నా” అని పాంటింగ్ తెలిపారు.

కాగా, ఇటీవల టీమిండియాకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గంభీర్ ను సంప్రదించగా.. అతను కూడా హెడ్ కోచ్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపించాడని ప్రచారం జరిగింది. భారత జట్టుకు కొత్త కోచ్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కత్త కోచ్ గా బీసీసీఐ ఎవరిని నియమిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News