Monday, May 6, 2024

‘శ్వాగ్’లో రుక్మిణి దేవిగా..

- Advertisement -
- Advertisement -

శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు హసిత్ గోలీతో అతను చేస్తున్న కొత్త సినిమాకి ‘శ్వాగ్’ అనే టైటిల్ హిలేరియస్ వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. టైటిల్, కాన్సెప్ట్ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి రీయూనియన్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రీతూ వర్మ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా శ్వాగ్ మేకర్స్ ఆమె పాత్రను వింజమర వంశంలోని మహారాణి రుక్మిణి దేవిగా పరిచయం చేశారు.క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో రీతూ వర్మ శ్రీవిష్ణు వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ కనిపించారు. మగవారి కంటే స్త్రీలు గొప్పవారు, శక్తివంతులు అని చెప్పారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీవిష్ణు, ‘శ్వాగ్’ అనేది మగవారి కథ, శ్వాగనికి వంశం కథ అని స్పష్టం చేశారు. వీడియో హిలేరియస్ గా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శ్వాగ్’- శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ మూవీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News