Wednesday, September 18, 2024

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నటి రియా సేన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో పూజా భట్, రితేశ్ దేశ్‌ముఖ్, టివి యాక్టర్ సుశాంత్ సింగ్ తర్వాత ఇప్పుడు సినీ నటి రియా సేన్ సైతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర గురువారం పాతూర్ నుంచి మొదలయింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వెంబడి రియాసేన్ కూడా కలిసి నడిచారు. ఆమె ప్రింటెడ్ ఆరెంజ్-రెడ్ కుర్తా, డెనీమ్ జీన్స్‌లో కనిపించింది. గత కొంతకాలంగా రియాసేన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె ఇదివరలో హిందీ సినిమాలు స్టయిల్, ఝంకార్ బీట్స్, ధూమ్, ఖయామత్: సిటీ అండ్ థ్రెట్ తదితర సినిమాల్లో నటించింది. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్తయి ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఆయన యాత్ర కనీసం 382కిమీ. ఉండనుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ కార్యవర్గం, నాయకుల్లో ఓ ఆశ నింపడానికి రాహుల్ యాత్ర ఓ ఊతం అవుతన్నట్లు కనబడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News