Wednesday, October 9, 2024

తన కూతురు సినీ రంగ ప్రవేశంపై స్పందించిన రోజా

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. పుట్టిన రోజున తిరుమల ఆలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లో విజయవంతంగా దూసుకెళ్తున్నానని ఆమె అన్నారు.

తన కొడుకు, కూతురు సినిమా రంగంలోకి వస్తే చాలా సంతోషిస్తానని చెప్పిన మంత్రి రోజా, తన కూతురు అన్షు సైంటిస్ట్ కావాలనుకుంటున్నారని, చదువులో బాగా రాణిస్తోందని తెలిపారు. తన కుమార్తెకు నటనా రంగంలోకి రావాలనే ఆలోచన లేదని ఆమె అన్నారు. జబర్దస్త్ కమెడియన్ వర్ష, గాయని మంగ్లీ తదితరులు మంత్రి రోజా వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News