Saturday, October 5, 2024

అనంతపురం ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట సమీపంలో నార్పల-అనంతపురం ప్రధాన రహదారిపై శనివారం అర్ధరాత్రి లారీ- ఇన్నోవా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్ప కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను అనంతపురం నగరానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News