Saturday, April 20, 2024

తెగిన రోడ్డు.. రాకపోకలకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : రాజంపేట మండలంలో ఆదివారం మద్యాహ్నం నుండి రాత్రి వరకు కురిసిన అకాల వర్షానికి ఎగువ ప్రాంతం నుండి వాగులు పోంగి రావడంతో కామారెడ్డి నుండి గుండారం మీదుగా మెదక్ వెళ్ళే రోడ్డు కోట్టుకపోవడంతో సోమవారం ఉదయం నుండి రాకపోకలు నిలచి పోయాయి. రోడ్డు ప్రాంతంలో బిడ్జి నిర్మాణ పనులు కోనసాగుతున్నాయి. తాత్కలికంగా వేసిన రోడ్డు కోట్టుకపోవడంతో రాక పోకలు నిలచిపోయాయి. కామారెడ్డి నుండి గుండారం, మెదక్ వెళ్ళే ప్రయాణికులు రామయంపేట్, లింగంపేట్, మాల్తుంమ్మెద మీదుగా ప్రయాణాన్ని కొనసాగించారు. గుండారం వైపు ద్వీచక్ర వాహనాలపై వెళ్ళేవారు శేర్‌శంకర్‌తాండ, ఎల్లారెడ్డిపల్లి మీదుగా ప్రయాణిస్తున్నారు.

Also Read: థాయిలాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్టు

దీంతో కోండాపూర్ వరకు ఆర్టీసి బస్సులు నడుపుతున్నారు. అకాల వర్షంతో మండలంలోని వ డగండ్ల వానలకు వరి పంటలు పూర్తిగా ద్వంసం అయ్యాయి. రో డ్డుపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. మండలంలోని పెద్దాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని ప్రవీణ్ కు మార్, నవీన్‌కుమార్‌లకు చెందిన 2 ఎకరాల ఉల్లిగడ్డ ద్వంసం అయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News