Thursday, April 18, 2024

బ్రేస్‌వెల్ చెమటలు పట్టించాడు.. ఓటమి తప్పదనుకున్న: రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం తొలి వన్డే నువ్వానేనా అన్నట్టు సాగింది. టీమిండియా 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. కష్టమైన లక్షంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కివీస్ 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బ్రాస్‌వెల్ వరుస ఫోర్లు, సిక్సర్లతో చెమటలు పట్టించాడు.

దీనిపై స్పందించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేస్ వేల్ ప్రశంసలు కురిపించాడు. అతని బ్యాటింగ్, షాట్ సెలక్షన్ అద్భుతమని కొనియాడాడు. బ్రేస్ వెల్ హిట్టింగ్ తో ఓ దశలో మ్యాచ్ ఓటమి తప్పదని అనుకున్నామని చెప్పాడు. డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు మరోసారి తెలిపోయారని చెప్పుకొచ్చాడు. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News