Saturday, April 27, 2024

రోహిత్ సెంచరీ… పలు రికార్డులు

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓపెనర్‌గా రోహిత్ 43వ శతకం బాది మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు డేవిడ్ వార్నర్(49), సచిన్ టెండూల్కర్(45) ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ 48 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ కూడా 48 సెంచరీలతో రోహిత్ సమంగా ఉన్నాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో 12 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో 2021 నుంచి ఆరు సెంచరీలు చేయగా తరువాత శుబ్‌మన్ గిల్ నాలుగు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా ఓపెనర్‌గా సునీల్ గావస్కర్ నాలుగు సెంచరీల రికార్డును రోహిత్ సమం చేశాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ వెయ్యి పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు వెయ్యి పరుగులు చేశారు. రోహిత్ శర్మ టెస్టుల్లో 12, వన్డేల్లో 31, టి20ల్లో 5 సెంచరీలు బాదాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News