Monday, April 29, 2024

ఐటీ దాడుల్లో రూ.290 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో రూ.290 కోట్లు పట్టుబడ్డాయి. ఒడిశా, జార్ఖండ్‌ల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఒక్క ఆపరేషన్ లోనే ఇంత భారీ ఎత్తున నల్లధనం పట్టుబడడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నోట్ల లెక్కింపు కోసం శనివారం ఐటీ శాఖ 40 యంత్రాలను వినియోగించింది. పట్టుబడిన డబ్బును ప్రభుత్వ బ్యాంకులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆయా కంపెనీ అధికారులు, ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. జార్ఖండ్‌కి చెందిన కాంగ్రెస్ నేత , రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ ఇంటిని కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. నగదు లెక్కింపు శనివారంతో ముగియనుంది. ఒడిశా లోని లిక్కర్ డిస్టిలరీ గ్రూపులపై ఐటీ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. బొలంగీర్ జిల్లా లోని సుదాపరాలో మద్యం తయారు చేస్తున్నే కొందరి నివాసం నుండి శనివారం 20 బ్యాగ్‌ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News