Sunday, April 28, 2024

గుజరాత్‌లో రూ.350 కోట్ల హెరాయిన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

వేరావల్(గుజరాత్): గిర్ సోమనాథ్ జిల్లాలోని వేరావల్ హార్బర్ సమీపంలో ఒక చేపల పడవ నుంచి రూ.350 కోట్ల విలువైన హెరాయిన్‌ను గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారి వెల్లడించారు. గురువారం రాత్రి జరిపిన దాడిలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాన్ని స్దాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా అందిన సమాచారం ఆధారంగా వేరావల్ హార్బర్ సమీపానికి చేరుకున్న ఒక చేపల పడవపై దాడి చేసినట్లు ఆయన తెలిపారు.

అందులోని రూ.350 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వేరావల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ పడవిలోని 9 మంది సిబ్బందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి మనోహర్‌సిన్హ్ జడేజా తెలిపారు.

స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 350 కోట్లు(కిలో 7 కోట్లు) ఉంటుందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి ఎక్స్ వేదికగా తెలిపారు. డ్రగ్స్‌పై తాము సాగిస్తున్న పోరాటంలో మరో విజయం దక్కిందని ఆయన తెలిపారు. సీల్డ్ ప్యాకెట్లలో ఉంచిన 50 కిలోల హెరాయిన్‌ను వేరావల్ హార్బర్‌కు చెందిన నాలియా గోలి కోస్ట్ వద్ద ఒక చేపల పడవ నుంచి స్వాధీనం చేసుకున్నామని మంత్రి తెలిపారు. ముగ్గురు ప్రధాన నిందితులతోసహా మొత్తం 9 మందిని అదుపులోకి ఈసుకున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News