Tuesday, April 30, 2024

ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు.. విజయానికి 152 పరుగుల దూరంలో భారత్

- Advertisement -
- Advertisement -

రాంఛీ:  భారత బౌలర్లు సత్తా చాటడంతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి ఇంకో 152 పరుగులు మాత్రమే అవసరం. భారత్ చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భత బౌలింగ్ తో రాణిస్తే తప్ప.. ఆ జట్టు గెలిచే పరిస్థితి లేదు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు కేవలం 145 పరుగులకే కుప్పకూలి.. భారత్ కు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అనంతరం టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(24 నాటౌట్), యశస్వీ జైస్వాల్(16 నాటౌట్)లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రోహిత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబ్టటారు. వీరిద్దరూ వికెట్ చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఆడుతూ మూడో రోజా ఆటను ముగించారు. భారత్, ఆట ముగిసేసమయానికి 40 పరుగులు చేసింది.

కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News