Saturday, April 20, 2024

చిన్నారుల గుండె కోసం హార్ట్‌థాన్ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

మహేష్ బాబు ఫౌండేషన్, ఔట్‌రీచ్ క్లబ్ కలిసి “గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా” సుమారు 300 మంది రన్ లో పాల్గొన్నారు. గుండె జబ్బులతో బాధపడే పిల్లలకు సహాయం చేసేందుకు ఔట్‌రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీ, మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హార్ట్‌థాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన, నిధుల కోసమే ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం మార్చి 16వ తేదీన కెబిఆర్ పార్క్‌లో జరిగింది, ఇందులో సుమారు 300 మంది వ్యక్తులు 3 కిలో మీటర్ల నుంచి 5 కిలో మీటర్ల వరకు పరుగెత్తారు. మహేశ్ బాబు ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు నమ్రతా శిరోద్కర్ ఈ వేడుకను పురస్కరించుకుని అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా విజేతలను వ్యక్తిగతంగా సత్కరించారు. దీనిలో అంకితభావంతో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడానికి వారి నిబద్ధతను మహేష్ బాబు ఫౌండేషన్, ఔట్‌రీచ్ క్లబ్‌ల మధ్య సహకార స్ఫూర్తిని హార్ట్‌థాన్ తెలియజేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News