Monday, April 29, 2024

నామినేషన్ల జోరు

- Advertisement -
- Advertisement -
గజ్వేల్, కామారెడ్డిలో సిఎం కెసిఆర్ నామినేషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె సిఆర్ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖ లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న సిఎం కెసిఆర్ తన నామినేషన్ పత్రాలను గురువారం ఆర్‌ఒ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అ ధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు వెళ్లి, నామినేషన్ దాఖలు చేసిన అనంత రం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన బిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి నామినేషన్ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గజ్వేల్, కామారెడ్డిలో కోలాహలం నెలకొంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సిఎం కెసిఆర్ ఇటీవల ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసే ముందు ప్రతిసారి సిఎం కెసిఆర్ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు నామినేషన్ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సిరిసిల్లలో నామినేషన్ వేసిస కెటిఆర్
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు గురువారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కెటిఆర్ ఐదోసారి బరిలో నిలిచారు. కాగా…గురువారం ఉద యం నామినేషన్‌కు వెళ్లే ముందు ప్రగతిభవన్‌లో కెటిఆర్ పూజలు నిర్వహించి.. వేద పండితులు ఆశీర్వచనాలు పొందారు. అనంతరం అక్కడి నుంచి సిరిసిల్లకు బయలుదేరి అక్కడి ఆర్‌డిఒ కార్యాలయంలో కెటిఆర్ నామినేషన్ వేశారు.
సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి హరీశ్‌రావు
బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకులు, మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్‌ఒ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్‌ఒ కార్యాలయానికి బయలుదేరారు.

KCR from Gazwel

Harish Rao

KTR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News