Friday, September 13, 2024

విరాళం ఇచ్చినందుకు మహిళకు 12 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు కేవలం 51 డాలర్లు (సుమారు రూ.4000) ఇచ్చిన కేసులో అమెరికారష్యన్ మహిళకు రష్యా కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రష్యాకు చెందిన సేనియా ఖజానీ ఓ డ్యాన్సర్. అమెరికా వ్యక్తిని పెళ్లాడి లాస్‌ఏంజెలెస్‌లో స్థిరపడింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు కొంతకాలం క్రితం స్వస్థలానికి వచ్చింది. అయితే ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థకు విరాళాలు స్వీకరిస్తున్నట్టు రష్యా అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను అరెస్టు చేసి విచారణ చేపట్టగా ఆమె అంగీకరించారు. రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఆ విరాళాలు సేకరిస్తున్నట్టు తనకు తెలియదని ఖవానా చెప్పినా ఆమెపై దేశద్రోహం కింద నేరం మోపారు. విచారణలో దోషిగా తేలడంతో రష్యా కోర్టు ఆమెకు 12 ఏళ్లు జైలు శిక్షవిధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News