Tuesday, September 10, 2024

త్వరలో రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటందని విశ్వసించే ప్రభుత్వం మా ది..అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ఎకరానికి రూ15వేలు అందిచాలన్న ది మా ప్రభుత్వ సంకల్పం ..రాష్ట్రంలోని వ్యవసా యకూలీలందరికీ ఏటా రూ.12వేలు ఆర్ధిక సహా యం అందించి ఆదుకోవలన్న లక్షంతో ముందు కు సాగుతాం..అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం స్వాతంత్రదినోత్సవ కా ర్యక్రమంలో పాల్గొన్న సీఎం గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.తొలుత దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాం క్షలు తెలిపారు.దేశ చరిత్రలో ఈ రోజు సువర్ణాక్ష రాలతో గర్వించదగ్గ రోజు అన్నారు.మనం అనుభ విస్తున్న స్వేచ్చ ,స్వాతంత్య్రం ఎందోర మహనీ యుల త్యాగఫలం అని , అటువంటి మహనీయు లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపా రు. అహింసనే ఆయుధంగా మలిచి ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మన దన్నారు.

ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుందని తెలిపారు. ఈ దేశానికి స్వా తంత్య్రం సాధించడంతో గమ్యం చేరినట్టు కాద న్నారు. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చతోరణాన్ని కట్టుకున్నాయంటే దానికి కార ణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులే అన్నారు.1947 వరకూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మన దేశం, ఈ నాడు ప్రపంచంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శా స్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన హరిత విప్లవమే అని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని, 2004 లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్ర జలకు సోనియాగాంధీ మాట ఇచ్చారని, జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో… ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మ రోసారి రుజువైందన్నారు.నాలుగు కోట్ల ప్రజల ఆ కాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరా టాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైందన్నారు.

ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసేప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీ కి పూర్వవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చామని, మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు.మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలుచేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

వ్యవసాయానికి అత్యంత ప్రధాన్యం:
మా ఎజెండాలో వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉందని వెల్లడించారు.అందుకే ఇటీవల బడ్జెట్ లో వ్యవసాయ, అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో 72,659 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకూ ఏక కాలంలో రుణ మాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నామని, 31 వేల కోట్లు వెచ్చించి… రైతును రుణ విముక్తుడిని చేస్తున్నామనివెల్లడించారు. రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించామని , దీనికి 33 రకాల వరిధాన్యాలను గుర్తించామని తెలిపారు.

పంటల బీమా పథకం:
రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. ’ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూ కనపడకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు 1930 నెంబర్ 24 గంటలు పని చేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు అంగన్వాడి లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నామని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతోందన్నారు. ఈ యూనివర్సిటీకి మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్ గా నియమించామని తెలిపారు

ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ :
తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలన్నారు.తెలంగాణ బ్రాండ్ ను విశ్వవేదిక పై సగర్వంగా చాటాలని, అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించామన్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలకు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించామన్నారు ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశామన్నారు. జనవరిలో దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని , ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు అన్నారు.ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రా అని కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు.ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించామని వెల్లడించారు.

దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను విజయవంతంగా జరిపించామని , 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ఉద్యోగ నియామక వయోపరిమితిని కూడా 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళకు పెంచామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ను ప్రవేశ పెట్టామని , దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు.

ఇందిరా మహిళా శక్తి పథకం:
రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసిందని వెల్లడించారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తినైపుణ్య శిక్షణ ఇప్పించి, బ్రాండింగ్, మార్కెటింగ్లలో మెళకువలు పెంపొందించే సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణబీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నామన్నారు. స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫారాలు కుట్టే పనిని అప్పగించడంతో పాటు, వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

విభజన సమస్యలు పరిష్కారం :
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్దకాలంగా ఏవిధమైన ప్రయత్నాలు జరగక పోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు కూడా తేలాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరం పరిష్కరించు కోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందన్నారు.

19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపామని, 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, తద్వారా 30 వేల మందికి పైగా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి ఈ పర్యటన ద్వారా పరిచయం చేశామన్నారు. భవిష్యత్ లో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందన్నారు. రైతులు, యువత, మహిళ, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News