Tuesday, September 10, 2024

సిఎంనే రాజీనామా చేయాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య మంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని మాజీ మం త్రి, ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి త నపై చేసిన విమర్శలను హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తిప్పి కొట్టారు. ‘దేవుళ్లపై ఒట్టు పెట్టుకొని  మాట మీద నిలబడక పోగా.. నిస్సిగ్గుగా బిఆర్‌ఎస్‌పై, తనపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ పుట్టిన రోజు కానుగా డిసెంబరు 9 నాటికి రూ.40 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చెప్పారని, అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరో నాటకానికి తెరలేపారని అన్నారు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే అతని లక్షణమని విమర్శించారు.

తాము మొదటి దఫాలో రూ. లక్ష రుణమాఫీ చేస్తేనే 35 లక్షల మంది రైతులకు రూ.17వేల కోట్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా..?..రూ.17,869 కోట్లు మాత్రం అవుతాయా..? అని ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే రుణమాఫీ పచ్చి అబద్ధం అని తేలిపోయిందని పేర్కొన్నారు. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి..?..ఏటిలో దుంకి ఎవరు చావాలి..? అని సిఎంను అడిగారు. రేవంత్‌రెడ్డి రైతు ద్రోహానికే మాత్రమే కాదు..దైవ ద్రోహానికి పాల్పడ్డారని అన్నారు. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పారో ఆ దేవుళ్లందరి వద్దకు స్వయంగా తానే వెళ్తానని, రేవంత్‌రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ప్రార్థించి వస్తానని హరీశ్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News