Saturday, October 12, 2024

మిల్లర్, డుసెన్ విధ్వంసం.. భారత్‌పై సౌతాఫ్రికా విజయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌తో గురువారం జరిగిన తొలి టి20లో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా మరో ఐదు బంతులు మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ బవుమా 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్ (22) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. అయితే ప్రెటోరియస్ 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో వేగంగా 29 పరుగులు చేశాడు. మరోవైపు వండర్ డుసెన్, డేవిడ్ మిల్లర్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాను గెలిపించారు. చెలరేగి ఆడిన మిల్లర్ ఐదు సిక్సర్లు, 4 బౌండరీలతో 31 బంతుల్లోనే అజేయంగా 64 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డుసెన్ ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 46 బంతుల్లోనే 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక టీమిండియాలో ఇషాన్ కిషన్ (76), హార్దిక్ (31), పంత్ (29), అయ్యర్ (36) పరుగులు చేశారు.

SA Win by 7 wickets against India 1st T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News