Sunday, January 26, 2025

‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటున్న ‘ఆచార్య’..

- Advertisement -
- Advertisement -

SAANA KASTAM Song Promo from Acharya

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రంలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో రెజీనాతో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. రేపు పూర్తి లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో చిరు సరసన రెండోసారి కాజల్ నటిస్తోంది. ఇక, సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

SAANA KASTAM Song Promo from Acharya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News