Friday, March 29, 2024

మునుపెన్నడూ లేనివిధంగా శబరిమలకు రూ. 320 కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

 

కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం శబరిమల. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి.
ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అందుకే ఏటా కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినప్పటికీ శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి దాదాపు రూ. 320 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది.
ఈ శుక్రవారం(జనవరి 20)తో వార్షిక తీర్థయాత్ర ముగియనుండడంతో ఆలయ ఆదాయాన్ని ప్రకటించింది ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు. జనవరి 14 నాటికి శబరిమల కొండ ఆలయానికి మునుపెన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయిలో రూ. 320 కోట్ల ఆదాయం అందిందని ఆలయ బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. ఇక 2018 లో ఆలయానికి ఆదాయంగా వచ్చిన రూ. 260 కోట్లు ఇప్పటివరకూ గరిష్ఠ ఆదాయంగా ఉండేది. అయితే రెండేళ్ల పాటు వేధించిన మహమ్మారి విరామం తర్వాత పూర్తి స్థాయి తీర్థయాత్రకు అనుమతించింది ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News