Friday, September 13, 2024

స్వంత కాంగ్రెస్ ప్రభుత్వం పై పైలట్ ఒత్తిడి

- Advertisement -
- Advertisement -

జైపూర్ : తాము కోరిన మూడు డిమాండ్లు నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన తప్పదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పైలట్ సోమవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు నోటీస్ జారీ చేశారు. రాష్ట్రంలో గత బిజేపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడం లేదంటూ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు ఐదు రోజుల పాటు సాగించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన బహిరంగ సభలో పైలట్ మాట్లాడారు.

అవినీతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌తోపాటు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌పిఎస్‌సి) ను రద్దు చేసి తిరిగి పునరుద్ధరించాలని, పేపర్ లీక్ తరువాత ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల రద్దు వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, పైలట్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తలమునకలై ఉన్న తరుణంలో రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్, అసమ్మతి నేత పైలట్ మధ్య అధికారిక ఘర్షణ తలెత్తడం చర్చనీయాంశం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News