Saturday, July 27, 2024

సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

క్రికెట్ దిగ్గజం సచిన్‌టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో కలకలం రేపింది. మహారాష్ట్ర లోని జామ్నర్ పీఎస్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ షిండే తెలిపిన వివరాల ప్రకారం జామ్నర్‌కి చెందిన ప్రకాశ్ కాఫ్టే ( 39) సచిన టెండూల్కర్ స్టేట్‌రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పిఎఫ్ )లో సెక్యూరిటీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి స్వగ్రామానికి వెళ్లాడు. ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన తన సర్వీస్‌గన్‌తో మెడపై కాల్చుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.ప్రకాశ్‌కు తల్లిదండ్రులు, భార్య ఇద్దరు పిల్లలున్నారు. ప్రకాశ్ ఆత్మహత్యపై పోలీస్‌లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్‌ఆర్‌పిఎఫ్ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News