Sunday, May 4, 2025

సాహస క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలి : బడుగు సైదులు

- Advertisement -
- Advertisement -

ముగిసిన బిసి గురుకుల విద్యార్థుల సెయిలింగ్ శిక్షణ కార్యక్రమం
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి గురుకుల విద్యాసంస్ఖల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచేలా వారికి శిక్షణ ఇస్తున్నామనిమహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అన్నారు. బిసి విద్యార్థుల సెయిలింగ్‌లోశిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తిని గమనించి క్రీడల్లో, ఆరట్స్, మ్యూజిక్, క్రాఫ్ట్ వంటి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బిసి గురుకుల విద్యాసంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

అందుకోసం ప్రత్యేకంగా వేసవి శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా బిసి గురుకుల విద్యార్థులకు సెలింగ్ క్రీడ ద్వారా శాస్త్రీయ శిక్షణతో పాటు నీటిలో నైపుణ్యం, సహానం, చురుకుదనం వంటి లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 60 మంది విద్యార్థులకు సెయిలింగ్ లో గత పది రోజులుగా రెండో విడతశిక్షణ అందించామన్నారు. వారిలో ఎంపికైన 30 మంది విద్యార్థులకు ఈనెల 8 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని జూన్ నెలలో హైదరాబాద్ లో జరిగే జాతీయ సెయిలింగ్ పోటీలకు పంపిస్తామని ఆయన చెప్పారు.

ఆ తర్వాత వారిని జాతీయ, అంతర్జాతీయ స్ఠాయిలోజరిగే పోటీల్లో పాల్గొనేలా శిక్షణ అందించి, పోటీలకు పంపిస్తామని వెల్లడించారు. సెయిలింగ్ లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి 2026 లో జరిగే ఆసియన్ గేమ్స్ , 2028లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బిసి గురుకులాల్లో చదువుతున్న 14 ఏళ్లలోపు వయసు గల విద్యార్థుల్లో ఆసక్తి గలవారిని బేసిక్ శిక్షణకు ఎంపిక చేశామని, అందులో ప్రతిభ కనబరిచిన వారికి గత పదిరోజులుగా శిక్షణ ఇచ్చామన్నారు. మొత్తం 60 మందివిద్యార్థులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారని ఆయన చెప్పారు. సెయిలింగ్ శిక్షణ పొందిన విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంజెపి జాయింట్ సెక్రెటరీ తిరుపతి, యాచ్ క్లబ్ నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News