Saturday, December 14, 2024

సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మళ్లీ బెదిరింపు అందింది. తాజా బెదిరింపులో ‘‘నువ్వు మా (బిష్ణోయ్ సమూహం) మందిరానికి వెళ్లి క్షమాపణలు చెప్పాలి లేదా రూ. 5 కోట్లు చెల్లించు. అలా చేయకపోతే నిన్ను చంపేస్తాం. మా గ్యాంగ్ ఇప్పటికీ క్రియాశీలకంగానే ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ బెదిరింపు వివరాలను మంగళవారం అధికారులు వెల్లడించారు. ఆ బెదిరింపు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు పంపించాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం వివిధ నేరారోపణల కింద గుజరాత్ లోని సబర్మలి జైలులో ఉన్నాడు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News