Sunday, December 15, 2024

ప్రైవేట్ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం పౌరుల ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రతి ఆస్తిని ప్రభుత్వం సామాన్య ప్రయోజనాల సేవ కోసం స్వాధీనం చేసుకోరాదని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం – కొన్ని కేసులలో ప్రైవేట్ ఆస్తులపై రాష్ట్రాలు దావా వేయొచ్చని పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను పంపిణీ చేయడానికి రాష్ట్రం స్వాధీనం చేసుకోవచ్చని జస్టిస్ కృష్ణయ్యర్ గతంలో ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు తోసిపుచ్చింది.

సిజెఐ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేశ్ రాయ్, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేశ్ బిందాల్, ఎసి శర్మ, అగస్టిన్ జార్జ్ మసీహ్ ఈ మెజారిటీ తీర్పు ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News