Sunday, April 28, 2024

శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -
Samsung-S10
గెలాక్సీ ఎస్10, నోట్ 10కు లైట్ వేరియంట్లు

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్‌లో 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2020 కార్యక్రమంలో ఈ నెల 7న శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ ధరను ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855, శాంసంగ్ ఫోన్ ప్యాక్ అప్‌టు 8 జిబి ర్యామ్, లోయర్ ఎండ్ 6 జిబి ర్యామ్,5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, మైక్రో ఎస్డీ కార్డు, 1 టిబి వరకు మెమరీని పెంచుకునే సదుపాయం ఉంటాయి. 4500 ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఫేస్ అన్‌లాక్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.ప్రిజమ్ వైట్, ప్రిజమ్ బ్లాక్, ప్రిజమ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

దీనితో పాటుగా గెలాక్సీనోట్ 10 లైట్ పేరిట మరో ఫోన్‌ను కూడా శాంసంగ్ విడుదల చేస్తుంది. గెలాక్సీనోట్ సిరీస్‌లో లభించే ఎస్‌పెన్‌ను కూడా లైట్ వేరియంట్లలో అందిస్తున్నారు. ఫొటోలు తీయడానికి, మల్టీ మీడియాను కంట్రోల్ చేయడానికి ఈ పెన్ ఉపయోగపడుతుంది.ఆరా గ్లో, ఆరా బ్లాక్, ఆరా రెడ్ రంగుల్లో గెలాక్సీనోట్ 10 లైట్ ఫోన్ లభిస్తుంది.

Samsung Galaxy S10 Lite is Coming Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News