Sunday, October 6, 2024

పెట్రోల్ డబ్బాతో పారిశుద్ధ కార్మికుల ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

ఐదేళ్లుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇద్దరు పారిశుద్ధ కార్మికులు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా, తాండూరు మున్సిపాలిటీలో సోమవారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. తాండూరుకు చెందిన నర్సింహులు, జ్యోతి మున్సిపల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్మికుల వేతనాలకోసం కార్యాలయంలో గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. 9 మంది ఉన్న ఒక గ్రూపులో నర్సింహులు, జ్యోతి ఉన్నారు. ఈ గ్రూపులో 7 మందికి వేతనాలు రాగా తమకు మాత్రం వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ వద్ద ఎన్నిసార్లు ప్రస్తావించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.

తమకు వేతనాలు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం ఒక్కటే శరణ్యమని బోరున విలపించారు. ఈ విషయమై కమిషనర్ విక్రంసింహారెడ్డి కార్మికులతో మాట్లాడేందుకు యత్నించగా వాగ్వావాదం చోటుచేసుకుంది. తమతోపాటు గ్రూపులో ఉన్నవారికి వేతనం వస్తోందని, తమకు మాత్రం ఎందుకు రావడం లేదని కమిషనర్‌ను ఆరు ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. ఆందోళనకారులను సముదాయించి ప్రజాపాలనలో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు అందజేయాలని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని కమిషనర్ నచ్చజెప్పడంతో శాంతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News