Monday, April 29, 2024

పారిశుద్ధ్య కార్మికులకు ఉదయం 6 గంటల తర్వాత హాజరు తీసుకోవాలి…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో:  చలి రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో పారిశుద్ధ్య  కార్మికులకు విధుల సమయాన్ని మార్చాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు తిప్పర్తి యాదయ్య జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం కమిషనర్ యూనియన్ ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేశారు. చలి తీవ్రత కారణంగా పారిశుద్ద కార్మికులు చాల ఇబ్బందులు పడుతుండడంతోపాటు వారు అనారోగ్యం భారిన పడుతున్నారని యూనియన్ అధ్యక్షులు తిప్పర్తి యాదయ్య కమిషనర్‌కు వివరించారు.

ప్రస్తుతం తెల్లవారు జామున 5 గంటల నుంచి 6 గంటల లోపు పారిశుద్ధ్య కార్మికులు బయో మెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారని, ఈ సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మార్చాలని కోరారు. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి పిబ్రవరి వరకు ఇదే పమయాన్ని అమలు చేస్తున్నారని ఈ ఏడాది కూడ అదే విధంగా చర్యలు తీసుకోవాలని తిప్పర్తి యాదయ్య కమిషనర్‌ను కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సి.హెచ్ కృష్ణ, కార్యనిర్వహక అధ్యక్షులు పి. జగన్ మోహన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News