Friday, September 20, 2024

‘సరిపోదా శనివారం’ ట్రైలర్ వచ్చేసింది…

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. మంగళవారం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “అభిమానులు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే వుంటాను.

ఈనెల 29న వస్తున్న సరిపోదా శనివారం సినిమాతో థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుందాం”అని అన్నారు. ఎస్‌జె సూర్య మాట్లాడుతూ “సినిమా సూపర్‌గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ ఇది. నాని ఈ సినిమాలో శనివారం బాషా. డి.వి.వి దానయ్య చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు”అని తెలిపారు. నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ “సరిపోదా శనివారం సినిమా మైండ్ బ్లోయింగ్. నాని, ఎస్‌జె సూర్య కెమిస్ట్రీ అదుర్స్. సినిమా బ్లాక్‌బస్టర్‌”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక మోహన్, కళ్యాణ్ దాసరి, హర్షిత్ రెడ్డి, హన్షిత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News