Tuesday, April 30, 2024

వాలెంటైన్స్ కానుకగా…

- Advertisement -
- Advertisement -

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు. సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటలో మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూపించనున్నారు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు నిజంగా ప్రిన్స్‌గా కనిపిస్తున్నాడు. కీర్తి సురేష్ మెరిసే చీరలో అందంగా ఉంది. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతారంలో మహేష్ బాబుని చూపిస్తున్నాడు పరశురామ్. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News