Friday, April 26, 2024

చెడు భావన, పక్షపాతంతో కూడినవి

- Advertisement -
- Advertisement -

జిడిపిపై రాజన్ విమర్శలను కొట్టిపారేసిన ఎస్‌బిఐ రీసెర్చ్

 

న్యూఢిల్లీ : భారతదేశం ప్రమాదకరంగా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్(వృద్ధి రేటు)కు చేరుతోందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ఎస్‌బిఐ రీసెర్చ్ నివేదిక తోసిపుచ్చింది. ఇటీవల భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వచ్చిన నేపథ్యంలో రాజన్ చేసిన విమర్శలు ‘చెడు భావన, పక్షపాతంతో కూడినది’ అని ఎస్‌బిఐ పేర్కొంది. త్రైమాసిక గణాంకాల ఆధారంగా జిడిపి వృద్ధిపై వ్యాఖ్యానించడం సరైంది కాదని ఎస్‌బిఐ నివేదిక ఎకోవ్రాప్ పేర్కొంది. రెండు రోజుల క్రితం రఘురామ్ రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై స్పందిస్తూ, దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితికి చేరుకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ చాలా ప్రమాదకరమైన రీతిలో హిందూ రేటు ఆఫ్ గ్రోత్‌కు చేరుకొంటోందని అన్నారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల క్షీణత, అత్యధిక వడ్డీలు, ప్రపంచ మాంద్యం వంటి పరిణామాలతో ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ పరిణామం ఏర్పడుతోందని రాజన్ తెలిపారు. 19501980 మధ్యకాలంలో నెలకొన్న తక్కువస్థాయి ఆర్థిక పురోగతిని హిందూ రేటు ఆఫ్ గ్రోత్‌గా ప్రముఖ భారతీ య ఆర్థికవేత్త రాజ్‌కృష్ణ ఈ పేరు పెట్టారు. హిందూరేటు చాలా ప్రమాదకరం అని రాజన్ అన్నారి. ఎక్కువకాలం ఇది కొనసాగితే అనర్థదాయకం అవుతుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌డిసెంబర్‌లో జిడిపి 4.4 శాతానికి నెమ్మదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News