Thursday, May 2, 2024

నీట్(పిజి) ప్రవేశాలపై 5న ”సుప్రీం”లో విచారణ

- Advertisement -
- Advertisement -

SC Agrees to Hear Plea for NEET-PG Admissions

న్యూఢిల్లీ: నీట్(పిజి) ప్రవేశాలకు సంబంధించి ఆర్థికంగా బలహీన వర్గాల(ఇడబ్లుఎస్) కోటాపై దాఖలైన కేసు విచారణను బుధవారం చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించడంతో చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును ఈ నెల 5వ తేదీన విచారిస్తామని తెలిపింది. నీట్(పిజి) ప్రవేశాలలో జాప్యం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుషార్ మెహతా ధర్మసనానికి తెలిపారు. ఈ కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనం చేపట్టాల్సి ఉన్నందున బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి అప్పచెబుతామని సిజెఐ రమణ తెలిపారు. నీట్(పిజి) కౌన్సెలింగ్‌లో జాప్యంపై ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వేదికగా రెసిడెంట్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియచేస్తున్నారు. ఇడబ్లుఎస్ కోటా నిర్ధారణకు సంబంధించి పునఃపరిశీలించాలని కేంద్రం నిర్ణయించడంతో నీట్(పిజి) కౌన్సెలింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News