Wednesday, April 24, 2024

నిరసనలు తెలిపే హక్కును గౌరవిస్తాం: సుప్రీం

- Advertisement -
- Advertisement -

Shaheen-Bagh

న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్ బాగ్ ఆందోళనలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. షహీన్ బాగ్ లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కోనసాగుతున్న ఆందోళనకారుల శిబిరాలను తొలగించేలా ఆదేశాలను జారీచేసేందుకు సుప్రీం కోర్టులో నిరాకరించింది. నిరసన హక్కులను గౌరవిస్తామన్న న్యాయస్థానం.. రోడ్డు రవాణాకు ఆటంకం కలిగిస్తూ సుధీర్ఘకాలం ఆందోళన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరసనల పేరుతో ప్రజలకు అసౌకర్యం కల్గించడం సరికాదని సుప్రీం తెలిపింది. నిరసనలు తెలపడానికి కేటాయించిన స్థలాల్లో ఆందోళన నిర్వహించుకోవచ్చు సూచించింది. షహీన్ బాగ్ ఆందోళనకారుల వాదన వినకుండా ఏకపక్షంగా తీర్పు ఇవ్వలేమన్న ధర్మసనం, పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం పాటు పోలీసులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. కాగా, 50రోజులపైగా డిల్లీలోని షహీన్ బాగ్ లో సిఎఎకు వ్యతిరేకంగా ఆందోళనలు కోనసాగుతున్నాయి.

SC issues notice to government and Delhi police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News